Asianet News TeluguAsianet News Telugu

అవిశ్వాసానికి ముందు ఐదుగురితో మోదీ చర్చలు.. ఎవరా ఐదుగురు?

అలా కాకుండా  బీజేపీ పైచేయి చూపించకపోతే.. అది కచ్చితంగా వారి పార్టీ భవిష్యత్తుపై తీవ్ర పరిణామాలు చూపిస్తుంది. కాబట్టి..ఈ అవిశ్వాసం విషయంలో మోదీ  కసరత్తులు  చేశారు.
 

Ahead of no-trust vote, PM Modi met these 5 top brass of BJP

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఈరోజు పార్లమెంట్ లో అవిశ్వాసం పెట్టిన సంగతి తెలిసిందే. వీలైనంత ఎక్కువ మంది మద్దతు కూడగట్టుకోవాలని టీడీపీ విశ్వప్రయత్నాలు చేసింది. ఈ అవిశ్వాస తీర్మానంలో బీజేపీనే కచ్చితంగా గెలుస్తుంది కానీ.. ఓటింగ్ లో తేడా ఎక్కువగా కనిపించాలి.అలా కాకుండా  బీజేపీ పైచేయి చూపించకపోతే.. అది కచ్చితంగా వారి పార్టీ భవిష్యత్తుపై తీవ్ర పరిణామాలు చూపిస్తుంది. కాబట్టి..ఈ అవిశ్వాసం విషయంలో మోదీ  కసరత్తులు  చేశారు.

అందులో మొదటిది.. ఈ రోజు పార్లమెంట్ సమావేశం ప్రారంభానికి ముందే మోదీ.. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, అనంత్ కుమార్ లతో భేటీ అయ్యారు. వారితో పలు విషయాలపై చర్చించారు.

అలాగే.. ఈ రోజు సమావేశాలకు పార్టీ ఎంపీలంతా కచ్చితంగా హాజరయ్యేలా ముందస్తు చర్యలు తీసుకున్నారు. గతంలో ఒకసారి రాజ్యసభలో బీసీలకు సంబంధించిన ఓ బిల్లు చర్చకు రాగా.. ఆ రోజు అధికార పార్టీకి చెందిన 30మంది ఎంపీలు, నలుగురు మంత్రులు కూడా గైర్హాజరయ్యారు. ఆ సమయంలో అధికార పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది.
 
కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు మోదీ ముందస్తు చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఎన్డీయే ఎంతటి అఖండ విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.

తర్వాతర్వాత కొన్ని పార్టీలు ఎన్డీయే నుంచి దూరంగా వెళ్లాయి. అయితే.. వారందరి మద్దతు కూడా మళ్లీ తీసుకోవాలని మోదీ భావిస్తున్నారు. అందుకు తగిన కార్యచరణ కూడా నిర్వహించారు.

అంతేకాకుండా గతంలో పార్లమెంట్ లో  ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశాన్ని కల్పించేవారు కాదు. కానీ ఈ సారి వారి వ్యూహాన్ని పూర్తిగా మార్చాలని మోదీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించి.. వారు అడిగే ప్రశ్నలకు ధీటుగా సమాధానాలు చెప్పాలని భావిస్తున్నారు. దానిని రానున్న ఎన్నికలకు అస్త్రంగా కూడా వాడుకోవాలని భావిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios