Assembly Elections 2022: అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్‌షోలు, పాద యాత్రలు, సైకిల్, వాహనాల ర్యాలీలపై నిషేధాన్ని పొడిగించింది, అలాగే.. ఇండోర్, అవుట్‌డోర్ రాజకీయ సమావేశాలపై కూడా నిబంధనలను సడలించింది.
Assembly Elections 2022: దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల మధ్య 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరుగనున్నాయి. ఈ నెల 10 నుంచి తొలి దశ పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్‌షోలు, పాద యాత్రలు, సైకిల్, వాహనాల ర్యాలీలపై నిషేధాన్ని పొడిగించింది. అయితే రాజకీయ పార్టీలకు ప్రచారానికి కొంత సడలింపు ఇచ్చింది. ఇండోర్ , అవుట్‌డోర్ రాజకీయ సమావేశాల నిబంధనలను సడలించింది. అవుట్ డోర్ సమావేశాలకు గరిష్టంగా 50 శాతం.. ఇండోర్ ఈవెంట్స్ కు 30 శాతం మించకుండా సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈ మేరకు షరతులకు లోబడి బహిరంగ సమావేశాలు, ఇండోర్ సమావేశాలు, ర్యాలీలను నిర్వహించాలని EC ప్రకటించింది.
ఈ ఈవెంట్‌లకు హాజరయ్యే వ్యక్తుల సంఖ్యను ఇండోర్ హాళ్ల సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం మరియు 30 శాతం మాత్రమే పరిమితం చేసే షరతులకు లోబడి బహిరంగ సమావేశాలు, ఇండోర్ సమావేశాలు, ర్యాలీలకు సంబంధించిన ఆంక్షలు మరింత సడలించబడతాయని EC ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ గ్రౌండ్ సామర్థ్యంలో శాతం.
ఇంటింటికీ ప్రచారంపై కూడా ఆంక్షాలను సడలించింది. గరిష్టంగా 20 మందికి మించకుండా ప్రచారం నిర్వహించాలని ఈసీ పేర్కొంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ప్రచారంపై నిషేధం ఉండేలా నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ తెలిపింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ మరియు పంజాబ్ ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలావుండగా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లకు తగిన భద్రత కల్పించాలని ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను శనివారం ఆదేశించింది. స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రక్రియలో అంతర్భాగమనీ, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడానికి వారి భద్రత చాలా ముఖ్యమైనదని పోల్ ప్యానెల్ నొక్కి చెప్పింది. దీంతో రాజకీయ పార్టీలు నియమించిన స్టార్ క్యాంపెయినర్లకు ఎన్నికల నిర్వహణ సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన భద్రత కల్పించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ సహా గోవా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ తగిన చర్యలు తీసుకుంది. ఈ రాష్ట్రాల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి.అలాగే.. ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ బూత్‌ల సంఖ్యను కూడా పెంచింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1,74,351 పోలింగ్ బూత్‌లు, ఉత్తరాఖండ్‌లో 11,647 పోలింగ్ బూత్‌లు, పంజాబ్‌లో 24,689 పోలింగ్ బూత్‌లు, మణిపూర్‌లో 2,959 పోలింగ్ బూత్‌లను ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
