హ్యుందాయ్ తరహలోనే కెఎఫ్‌సీ, పిజ్జా హట్ లో కూడా కాశ్మీరీ సాలిడారిటీ డే రోజు పాకిస్తాన్ కు అనుకూలంగా పోస్టులు పెట్టాయి.ఈ పోస్టులపై ఇండియన్లు మండిపడుతున్నారు.

న్యూఢిల్లీ: హ్యుందాయ్ తరహలోనే కేఎఫ్‌సీ, పిజ్జా హట్ లు కూడా కాశ్మీర్ Solidarity Day కు తమ మద్దతును ఇచ్చాయి. కాశ్మీర్ వేర్పాటు వాదులకు మద్దతిచ్చేలా ఆయా సంస్థలు తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్టులు చేశారు. హ్యూందాయ్, కియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఈ పోస్టు అప్ లోడ్ అయింది. ఈ పోస్టులపై నెటిజన్లు మండిపడ్డారు.KFC, Pizza Hut వంటి అంతర్జాతీయ ఫుడ్ సంస్థలు ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టులు భారతీయులను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో #BoycottKFC #BoycottPizza Hut అనే హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ అవుతున్నాయి. 

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

Kshmir సంఘీభావ దినోత్సవం సందర్భంగా గత ఏడాది కెఎఫ్ సి భారత భూభాగం నుండి కాశ్మీర్ ను విడదీయడమే లక్ష్యంగా పిలుపునిచ్చింది. ప్రతి ఏటా ఫిబ్రవరి 5వ తేదీని పాకిస్తాన్ కాశ్మీర్ సాలిడారిటీ దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఆ రోజున కాశ్మీర్ వేర్పాటువాదులకు తమ మద్దతును పాకిస్తాన్ తెలుపుతుంది. 1991లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కాశ్మీర్ పై KFC పాకిస్తాన్ Face book హ్యుందాయ్ మాదిరిగానే వివాదంగా మారింది. మీరు మా ఆలోచనలను ఎప్పటికి విడిచి పెట్టలేదు, రానున్న రోజుల్లో మీకు శాంతిని తెస్తాయని మేం ఆశిస్తున్నాం అని రాశారు. అంతేకాదు కాశ్మీర్ .... కాశ్మీరీలదేనని ఆ పోస్టులో ఉంది. ఈ పోస్టును ఫిబ్రవరి 5వ తేదీన భారత కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 1:18 గంటలకు పోస్టు చేశారు. అయితే ఈ పోస్టులపై సోషల్ మీడియాలో రచ్చ కావడంతో ఈ నెల 7వ తేదీన సాయంత్రం 18:15 గంటలకు తొలగించారు. 

ఈ పోస్టును తొలగించిన గంట తర్వాత కేఎఫ్‌సీ ఇండియా ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పింది. తాము ఇండియాను గౌరవిస్తామని ప్రకటించింది. భారత దేశం వెలుపల కొన్ని కెఎప్‌సీ సోషల్ మీడియాలలో పోస్టులపై క్షమాపణలు కోరుతున్నట్టుగా ప్రకటించింది. ఇండియాను గౌరవిస్తామన్నారు. అంతేకాదు భారతీయులందరికీ సేవ చేయడం తమకు గర్వమన్నారు.

కేఎఫ్‌సికి ఇండియా ప్రధాన మార్కెట్. తాజాగా కేఎప్‌సి పెట్టిన ఈ పోస్టు ఆ సంస్థకు ఇబ్బందిగా మారే అవకాశాలు లేకపోలేదు. 
జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమని దశాబ్దాలుగా ఇండియా స్పష్టం చేస్తుంది. కాశ్మీర్ విషయమై భారత్ తో యుద్దం చేసిన ప్రతిసారి పాకిస్తాన్ ఓటమి పాలైంది.