Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్‌ సంక్షోభం: మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ హైలెవల్ భేటీ

ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ప్రస్తుత పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసరం సమావేశం నిర్వహించారు. మోడీ నివాసంలో జరిగిన ఈ భేటీకి హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. 

Afghanistan Crisis PM narendra Modi Holds High Level Meeting
Author
New Delhi, First Published Aug 17, 2021, 7:10 PM IST

ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ప్రస్తుత పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసరం సమావేశం నిర్వహించారు. మోడీ నివాసంలో జరిగిన ఈ భేటీకి హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. 

మరోవైపు ఆప్ఘనిస్తాన్ లో పరిస్థితి రోజు రోజుకీ దారుణంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో..  కాబూల్ లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాన్ని మూసివేశారు.  అక్కడి పరిస్థితులు  సరిగాలేకపోవడంతో.. భారతీయ అధికారులను ప్రత్యేక విమానంలో.. భారత్ కి తరలించారు.

Also Read:ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ లో... అఫ్గాన్ నుంచి గుజరాత్ కి చేరుకున్న భారత అధికారులు

ఇప్పటికే భారత రాయబారి సహాయ ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థదితుల దృష్ట్యా కాబూల్ లోని కాబూల్‌లోని భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బంది, భద్రతా విభాగాల అధికారులను వెంటనే తరలించాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరందమ్ బగ్చీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios