ఇస్రో చరిత్రలో మరో మైలురాయి: తుదికక్ష్యలోకి ప్రవేశించిన ఆదిత్య ఎల్ -1

 ఆదిత్య ఎల్ -1  తుది కక్ష్యలోకి చేరింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు  ఆదిత్య ఎల్-1 ను  ఇస్రో శాస్త్రవేత్తలు  నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
 

Aditya-L1 reaches solar destination: PM Modi commends landmark achievement lns

న్యూఢిల్లీ: ఆదిత్య  ఎల్  1  వ్యోమ నౌక  శనివారంనాడు  తుది కక్ష్యలోకి  ప్రవేశించింది.ఇవాళ సాయంత్రం నాలుగు గంటల సమయంలో  శ్రీహరికోట నుండి శాస్త్రవేత్తలు  వ్యోమనౌకను తుది కక్ష్యలోకి  ప్రవేశ పెట్టారు. 

also read:నేడు తుది కక్ష్యలోకి :అందరి చూపు ఆదిత్య ఎల్-1పైనే

2023 సెప్టెంబర్ 2 వ తేదీన  ఆదిత్య ఎల్ -1 ను  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించారు.  ఈ127 రోజుల పాటు ప్రయాణించిన ఆదిత్య ఎల్-1  ఇవాళ  సాయంత్రం నాలుగు గంటలకు తుది కక్ష్యలోకి చేరింది.ఐదేళ్ల పాటు  ఆదిత్య ఎల్ -1  సేవలను అందించనుంది.  సూర్యుడికి సమీపంలోని  లాంగ్రాజ్ పాయింట్ హాలో  కక్ష్యలోకి  ఇవాళ సాయంత్రం ఆదిత్య ఎల్ -1 శాటిలైట్ ను  ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు.

ప్రధాని నరేంద్ర మోడీ  అభినందనలు


ఆదిత్య ఎల్-1 తుది కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించడంపై  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలను అభినందించారు.  ఆదిత్య ఎల్ -1  విజయవంతంగా తుది కక్ష్యలోకి ప్రవేశించడం మరో ముఖ్యమైన మైలు రాయిని సూచిస్తుందని  మోడీ పేర్కొన్నారు.  

అత్యంత క్లిష్టమైన  అంతరిక్ష యాత్రను సాధించడంలో  భారత శాస్త్రవేత్తుల అచంచలమైన అకింతభావాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.  మానవాళి  మెరుగుదలకు  ఈ ప్రయోగాలు  పనికొస్తాయని  మోడీ అభిప్రాయపడ్డారు . కొత్త శాస్త్రీయ పరిధులను అన్వేషించడానికి  భారత్ నిబద్దతను ఈ ప్రయోగాలు రుజువు చేస్తున్నాయని మోడీ చెప్పారు.
 

ఆదిత్య ఎల్-1 ద్వారా చేయనున్న పరిశోధనలు

సూర్యుని బయటి పొరలు ఎలా వేడేక్కుతున్నాయో అధ్యయనం చేయనున్నారు.సూర్యుని చుట్టూ ఉన్న కణాలు ప్లాస్మా వాటి గతిశీలతను అధ్యయనం చేయడానికి డేటాను సేకరించనున్నారు. సౌర కొరొనా , దాని లూప్ ల ఉష్ణోగ్రత, వేగం, సాంద్రతను కూడ అధ్యయనం చేయనున్నారు. సౌర తుఫానులకు గల కారణాలను  కూడ అధ్యయనం చేయనున్నారు శాస్త్రవేత్తలు.సూర్యుడి వివిధ పొరలలో సౌర విస్పోటనం సంఘటనలకు దారితీసే ప్రక్రియలపై  కూడ  శాస్త్రవేత్తలు  పరిశోధనలు చేస్తారు. 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios