లక్నో: నిత్యం దేవుడి భక్తిలో మునిగి  తేలే   ఓ భక్తురాలు దేవుడిని కలుసుకొనేందుకు వెళ్లేందుకు ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. మరణించింది రష్యన్ యువతి.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వృందావన్ అపార్ట్ మెంట్ లో రష్యన్ యువతి నివాసం ఉంటుంది. ఫిబ్రవరి నుండి ఆమె ఇదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటుంది.

తాను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ఆరో అంతస్తు పై నుండి శనివారం నాడు దూకి ఆత్మహత్య చేసుకొంది. కృష్ణుడిపై ఆమెకు అమితమైన ప్రేమ. కృష్ణుడిని కలవాలనే కోరిక ఆమెకు ఉండేది.కృష్ణుడిని కలవాలనే ఉద్దేశ్యంతోనే  ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అదే భవనంలో నివసిస్తున్న స్నేహితురాలు పోలీసులకు తెలిపారు.

ఆత్మహత్య చేసుకొన్న యువతి రష్యాలోని రోస్తవ్ నగరానికి  చెందింది. ఆమె మరణం విషయం రష్యన్ ఎంబసీకి సమాచారం ఇచ్చారు.ప్రయాణీకురాలి వీసా పై ఆ యువతి ఇండియాాకు వచ్చింది. కృష్ణుడంటే ఆమె అమితమైన అభిమానమని మృతురాలి స్నేహితురాలు చెప్పారు.