ఆమె  రాష్ట్ర కాంగ్రెస్‌ మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు మహాత్మా శ్రీనివాసన్‌ సమక్షంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్‌ మానవ హక్కుల విభాగం ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. 

ప్రముఖ సినీ నటి షకీలా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళయాళ చిత్రాల్లో గ్లామర్ పాత్రలు పోషించి.. తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి షకీలా. కాగా.. ఆమె రాష్ట్ర కాంగ్రెస్‌ మానవ హక్కుల విభాగం అధ్యక్షుడు మహాత్మా శ్రీనివాసన్‌ సమక్షంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్‌ మానవ హక్కుల విభాగం ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

షకీలా శుక్రవారం చెన్నైలోని సత్యమూర్తి భవన్‌కు వచ్చి పార్టీ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నిర్వాహకులను కలిసి సభ్యత్వ కార్డును అందుకున్నారు. ఈమె శనివారం నుంచి ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. షకీలా జీవిత కథ ఆధారంగా తాజాగా ఓ సినిమా కూడా తెరకెక్కుతోంది.