న్యూఢిల్లీ: ఆప్‌ ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి సోమ్‌నాథ్‌ భారతీకి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2016లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) సెక్యూరిటీ సిబ్బందిపై దాడి కేసులో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.

 ఆసుపత్రి ఆస్తికి నష్టం కలిగించినట్లు నిర్ధారణ కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తున్నట్లు అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ రవీంద్ర పాండే శనివారం స్పష్టం చేశారు. రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. సోమ్‌నాథ్‌ భారతీకి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసుకోవచ్చని పేర్కొంది.

2016 సెప్టెంబర్ 9న  సోమ్ నాథ్ భారతి మరో 300 మందితో కలిసి ఎయిమ్స్ ప్రహరీగోడపై ఉన్న ఫెన్సింగ్ ధ్వంసం చేసినట్టుగా కేసు నమోదైన విషయం తెలిసిందే.ఫెన్సింగ్ ధ్వంసం కాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డుపై సోమ్ నాథ్ భారతి అనుచరులు కూడ దాడికి ప్రయత్నించారు.