ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి ప్రియుడి పడకగదిలోనే పూడ్చిపెట్టిన దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. వివరాల్లోకి వెడితే...

పశ్చిమబెంగాల్, కోల్ కతాలో నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని నార్త్ 24పరగణాస్ జిల్లా బొంగావ్ గ్రామ నివాసి రామకృష్ణ సర్కారు(42), స్వప్న(38)లు భార్యాభర్తలు. స్వప్నకు సుజిత్ దాస్ అనే  ప్రియుడు ఉన్నాడు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని రామకృష్ణ సర్కార్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. 

పథకం ప్రకారం రామకృష్ణను కత్తితో పొడిచి చంపారు. అనంతరం మృతదేహాన్ని ప్రియుడు సుజిత్ దాస్ పడకగదిలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. మర్డర్ మిస్టరీ చేధించిన పోలీసులు స్వప్న, సుజిత్ దాస్ తో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను హతమార్చిందని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని వెలికితీయగా శరీరంపై కత్తి గాయాలున్నాయి. 

నిందితుడి ఇంటి ముందు రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులు తనిఖీలు చేయగా పడకగదిలో గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చి పెట్టారని తేలిందని పోలీసులు వివరించారు. హంతకులు స్వప్న, సుజిత్ దాస్ లను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.