అయ్యో.. క్లాత్ షోరూంలో గ్లాస్ డోర్ పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వీడియో వైరల్.. పేరెంట్స్ పై నెటిజన్ల ఆగ్రహం
ఓ మూడేళ్ల చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి క్లాత్ షోరూమ్ కు వెళ్లింది. తల్లిదండ్రులు షాపింగ్ చేస్తుండగా.. చిన్నారి మాత్రం ఆ షోరూమ్ గ్లాస్ డోర్ దగ్గర ఆడుకునేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆ గ్లాస్ డోర్ ఒక్కసారి ఊడిపడటంతో చిన్నారి మరణించింది.
పంజాబ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. లూథియానా సిటీలోని ఓ క్లాత్ షో రూమ్ లో గ్లాస్ డోర్ పడటంతో ఓ మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన మొత్తం అ షోరూమ్ లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Telangana rains : తెలంగాణను ముంచెత్తిన వర్షాలు.. మరో రెండు రోజులూ ఇదే పరిస్థితి..
ఆ వీడియోలో.. గ్లాస్ డోర్ దగ్గర చిన్నారి ఆడుకుంటోంది. దానికి సమీపంలో ఒకరు ఉన్నారు. అయితే ఆ చిన్నారి ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గ్లాస్ డోర్ పడిపోయింది. దీంతో ఆ బాలిక తీవ్రగాయాలతో అక్కడే మరణించింది. బాలిక గ్లాస్ హ్యాండిల్ పట్టుకొని ఉండగానే హఠాత్తుగా ఈ నిర్మాణం పడిపోయిందని, ఒకే సారి అంత బరువు పడటంతో చిన్నారికి గాయాలు అయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన యూజర్ పేర్కొన్నారు.
ఈ ఘటనపై పలువురు సోషల్ మీడియా యూజర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ షోరూం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో పాటు షోరూం మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MLC Kavitha: "అందుకే.. బాండ్ పేపర్ల పేరిట కాంగ్రెస్ కొత్త డ్రామా"
సరిగ్గా గ్లాస్ డోర్ ను ఇన్ స్టలేషన్ చేయించని దుకాణాదారుడిని శిక్షించాలని ఓ యూజర్ పేర్కొనగా.. సాలిడ్ ఫ్రేమ్స్ లేకుండా గాజు నిర్మాణాలు ఏర్పాటు చేయించకూడదని, ఇలాంటి విషయాల్లో శ్రద్ధ వహించాలని మరో యూజర్ పేర్కొన్నారు. చిన్నారి తల్లిదండ్రుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని పలువురు యూజర్లు ఆరోపిస్తున్నారు. ‘‘ఇది చాలా ఉంది.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తల్లిదండ్రులపై హత్య కేసు నమోదు చేయాలి’’ అని ఓ యూజర్ డిమాండ్ చేశారు.