Saharsa district: వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన దుండగులు ఆపై కాల్పులు జరిపారు. ఆ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు ఆమె సమీప బంధువు, అతని స్నేహితుడిగా పోలీసులు గుర్తించారు. కాల్పులు జరపడంతో బాధితురాలి ఎడమకాలుతో బుల్లెట్ తగిలింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Married woman gang-raped: వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన దుండగులు ఆపై కాల్పులు జరిపారు. సదరు మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు ఆమె సమీప బంధువు, అతని స్నేహితుడిగా పోలీసులు గుర్తించారు. కాల్పులు జరపడంతో బాధితురాలి ఎడమకాలుతో బుల్లెట్ తగిలింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఒక వివాహితపై సమీప బంధువు, అతని స్నేహితుడు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బీహార్ లోని సహర్సా జిల్లాలో చోటుచేసుకుంది. అత్యాచారం చేసిన తర్వాత నిందితులు బాధితురాలిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనతో సదరు మహిళ ఎడమకాలులోకి బుల్లెల్ వెళ్లింది. బంగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నారు.
ఆర్ధరాత్రి సమయంలో బాధితురాలిని ఆమె బంధువు, అతని స్నేహితుడు బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. ఈ క్రమంలోనే ఎవరూలేని సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఈ క్రమంలోనే ఆ మహిళ కేకలు వేస్తూ అరవడంతో ఆమెపై నిందితులు కాల్పులు జరిపారు. దీంతో ఆమె ఎడవకాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న మహిళ.. ఈ దారుణం గురించి కుటుంబ సభ్యులకు వివరించింది. వారు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదుచేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మరో ఘటన.. సిట్ ఏర్పాటుకు డిమాండ్..
సహర్సాలోని పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారంపై సిట్ ను ఏర్పాటు చేయాలనీ, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరపాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను కోరారు. ఈ ఘటనపై కఠిన దర్యాప్తు జరపాలనీ, బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సహాయం, నష్టపరిహారం అందించాలని సీఎంకు పంపిన లేఖలో కోరారు. ఈ ఘటనపై డీసీడబ్ల్యూకు ఫిర్యాదు అందిందని మలివాల్ తెలిపారు. స్కూల్ మేనేజర్ కుమారుడు (30) రెండేళ్లుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు బాలికను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు.
పాఠశాలకు చెందిన మహిళా ప్రిన్సిపాల్ నిందితులకు ఈ నేరం చేయడానికి సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు మలివాల్ తెలిపారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామన్నారు. అయితే ఇప్పటి వరకు బీహార్ ప్రభుత్వం నుంచి ఎవరూ తనను కలవలేదని బాధితురాలు కమిషన్ కు తెలిపింది. తదుపరి న్యాయ సహాయం, పరిహారం ఇంకా ఆమెకు చేరాల్సి ఉంది. అలాగే, ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హృదయ విదారక ఘటన బాధితురాలిని తీవ్రంగా కలచివేసిందనీ, దీనిపై సిట్ తో విచారణ జరిపించి కఠిన, సమగ్ర దర్యాప్తు జరిగేలా చూడాలని మలివాల్ ముఖ్యమంత్రిని కోరారు.
