మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ పులి పిల్లను గ్రామప్రజలు వెంటాడి వేటాడి చంపారు. కోయిలార్ గ్రామంలోకి తెల్లవారుజామున ఓ పులిపిల్ల ప్రవేశించింది. అయితే తమను ఏమైనా చేస్తుందని భయపడిన వారు దానిని తరిమారు. చెట్టెక్కి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న పులిపిల్లను రాళ్లతో తీవ్రంగా కొట్టారు.  

పొదల్లో పడ్డాక దానిని నేలమీదకు వేసి చావబాదారు. చనిపోయిన తర్వాత కూడా దానిని వదలకుండా...రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ తతంగాన్ని వీడియో తీసి తామేదో ఘనకార్యం సాధించిన వారిలా పైశాచిక ఆనందం పొందారు. గత కొన్ని రోజులుగా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటంతో పోలీసులు సుమోటాగా కేసును స్వీకరించి బాధ్యులను అదుపులోకి తీసుకున్నారు.