బాలుడితో పార్కుకు వెళ్తే బాలికపై అత్యాచారం..స్నేహితులు అప్పగిస్తే.. పలు ప్రాంతాలకు తీసుకెళ్లి గ్యాంగ్ రేప్
ఓ బాలుడితో పార్కుకు వెళ్లిన బాలికకు చేదు అనుభవం ఎదురైంది. ఆ బాలుడే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి.. అనంతరం బాధితురాలని స్నేహితులకు అప్పగించాడు. తరువాత వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాంచీలో జరిగింది.
రాంచీలో దారుణం జరిగింది. ఓ 14 ఏళ్ల బాలిక ఓ బాలుడితో కలిసి పార్కుకు వెళ్లింది. అక్కడ ఆ బాలుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం తన ముగ్గురు స్నేహితులకు అప్పగించాడు. వారు బాధితురాలని పలు ప్రదేశాలకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మైనర్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
లోక్ పోల్ సర్వే : తెలంగాణలో కాంగ్రెస్ జోరు.. రెండో స్థానంలో బీఆర్ఎస్, వెనకబడ్డ బీజేపీ..
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాంచీ నగరంలోని ఓ ప్రాంతలో నివసించే బాలిక సోమవారం పొరుగున ఉన్న ఖుంటి జిల్లాలోని జింకల పార్కుకు వెళ్లింది. అయితే బాలికపై బాలుడు అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం తన ముగ్గురు స్నేహితులను అక్కడికి పిలిపించాడు. అందులో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు.
7 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు.. ముంబైలో ఘటన
అనంతరం తన స్నేహితులకు బాలికను అప్పగించారు. వారు బాలికను దశం జలపాతానికి, ఆ తర్వాత నగ్రికి తీసుకెళ్లి రాత్రి పాడుబడిన గదిలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యలో మరో వ్యక్తి కూడా చేరాడు. అనంతరం నిందితులంతా కలిసి బాధితురాలిని మంగళవారం ఉదయం ధుర్వా డ్యామ్ వద్దకు తీసుకెళ్లి అక్కడే వదిలేశారు.
నీవు లేక నేను బతకలేనని.. ప్రాణ స్నేహితుడి ఆత్మహత్యను తట్టుకోలేక యువకుడి బలవన్మరణం..
అక్కడి నుంచి బాధితురాలు ఇంటికి వచ్చింది. తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో వారు బుధవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాంచీ ఎస్ఎస్పీ చందన్ కుమార్ సిన్హా గురువారం మాట్లాడుతూ.. ‘‘ అత్యాచారం ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే స్పందించారు. కొన్ని గంటల్లోనే దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశాం. అలాగే ఓ మైనర్ ను అదుపులోకి తీసుకున్నాము. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నాం.’’ అని తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు.