Asianet News TeluguAsianet News Telugu

రన్నింగ్ బ‌స్సులో ఒక్కసారిగా మంటలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ర‌న్నింగ్ బస్సులో మంట‌లు చెల‌రేగాయి. కర్మాడ్ నుంచి ఔరంగాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్​కు వెళ్తున్న ఈ స్మార్ట్ సిటీ బస్సులో.. వరూద్ ఫతా ప్రాంతంలో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.  

A fire broke out in a running bus in Maharashtra Aurangabad city.
Author
First Published Sep 19, 2022, 4:36 AM IST

మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ర‌న్నింగ్ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.  అప్ర‌మ‌త్త‌మైన ప్రయాణీకులు వెంట‌నే బ‌స్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. అంత‌లోనే మంట‌లు దావాళంలా వ్యాపించాయి. అంద‌రూ చూస్తుండ‌గానే.. బ‌స్సుకు అన్ని వైపుల మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అగ్నిమాపక దళం బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. 

అందిన సమాచారం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో కర్మాడ్ నుంచి ఔరంగాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్​కు వెళ్తున్న స్మార్ట్ సిటీ బస్సు (బస్సు నంబర్ ఎంహెచ్ 20 ఈఎల్ 1363)లో వరూద్ ఫతా ప్రాంతంలో ఉండగా మంటలు చెలరేగాయి. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో  దాదాపు 10 నుంచి 12 మంది వరకు ప్రయాణించారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణికులు బ‌స్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.

అంద‌రూ చూస్తుండ‌గానే.. బ‌స్సుకు అన్ని వైపుల మంటలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. స్మార్ట్ సిటీ బస్సులో మంటలు చెలరేగడం గురించి ఇంకా సమాచారం తెలియ‌రాలేదు.

ఈ ఘ‌ట‌న సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. ఆ వీడియోలో బస్సు మొత్తం మంటల్లో చిక్కుకోవడంతోపాటు చుట్టుపక్కల పొగలు కమ్ముకున్నట్లు చూడవచ్చు. మంటలు చెలరేగడంతో బస్సు మొత్తం కాలి బూడిదైంది.

Follow Us:
Download App:
  • android
  • ios