Asianet News TeluguAsianet News Telugu

డెలివ‌రీ బాయ్ నిర్వాకం.. ఫుడ్ ఇచ్చేందుకు వెళ్లి ఒంటరిగా ఉన్న యువతికి ముద్దు..

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం ఆ యువతికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఫుడ్ పార్శిల్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఈ ఘటన పుణెలో జరిగింది.

A delivery boy who went to deliver food and kissed a lonely young woman
Author
First Published Sep 20, 2022, 1:54 PM IST

పూణెలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లిన ఓ బాయ్.. ఓ మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఉన్న‌ట్టుండి ఆమెను వెన‌కాల నుంచి ప‌ట్టుకొని ముద్దుపెట్టాడు. ఒక్క సారిగా జ‌రిగిన ఈ ప‌రిణామంతో ఆమె ఖంగుతింది. మొద‌ట ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌డానికి బ‌య‌ప‌డిన ఆ మ‌హిళ.. ధైర్యం చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

త‌మిళ‌నాడులో దారుణం.. డీఎంకే కార్య‌క‌ర్త‌ను న‌రికి చంపిన మ‌హిళ‌.. ఎందుకంటే ?

వివ‌రాల ఇలా ఉన్నాయి. పుణేలో ఓ ప్ర‌ముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువ‌తి (19) విధులు నిర్వ‌ర్తించి యెవ్లెవాడి ప్రాంతంలోని ఓ సొసైటీలో ఉండే త‌న ప్లాట్ కు చేరుకుంది. త‌నతో పాటు ప్లాట్ ఉండే స్నేహితులు వాళ్ల ఇంటికి వెళ్లారు. దీంతో ఒంట‌రిగా ఉన్న ఆ యువ‌తి జొమోటాలో ఫుడ్ ఆర్డర్ చేసింది. కొంత స‌మ‌యం త‌రువాత ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్ ను తీసుకొని ఓ డెలివ‌రీ బాయ్ వ‌చ్చాడు. కాలింగ్ బెల్ నొక్కాడు.

నోయిడాలో ప్రహరీగోడ కూలి నలుగురు మృతి.. డ్రైనేజీ రిపేర్ పనులు చేస్తుండగా ఘటన..

ఆమె వ‌చ్చి డోర్ తీసింది.ఆమెకు పార్శిల్ అంద‌జేశాడు. ప్లాట్ లో ఎవరెవరు ఉంటారు అనే వివ‌రాల అడిగాడు. అత‌డు అడిగిన స‌మాచారాన్ని అంతా ఆ యువ‌తి చెప్పేసింది. దీంతో ఆ ప్లాట్ లో ఎవ‌రూ లేర‌ని నిర్ధారించుకున్న డెల‌వ‌రీ బాయ్..త‌నకు తాగేందుకు నీళ్ల కావాల‌ని కోరాడు.ఆమె లోప‌లికి వెళ్లే స‌రికి వెన‌కాల నుంచి ఒక్క సారిగా ప‌ట్టుకొని చెంప‌పై ముద్దు పెట్టాడు. దీంతో ఆమె షాక్ అయ్యింది. ఈ ఘ‌ట‌న శ‌నివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై మొద‌ట పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు ఆమె భ‌య‌ప‌డింది. కానీ ధైర్యం కూడ‌గ‌ట్టుకొని కోండ్వా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన జొమాటో డెలివరీ బాయ్ పేరు రయీస్ షేక్ అని, అత‌డి వ‌య‌స్సు 40 సంవత్స‌రాలు అని పోలీసులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios