స్కూల్ మేట్ మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కొడుకుకు బుద్ధి చెప్పాల్సింది పోయి... ఆ తండ్రి తానే కీచకుడిలా మారాడు. ఆ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఉత్తరప్రదేశ్ : యూపీలోని పిలిభిత్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ 15 ఏళ్ల బాలికను.. 18 ఏళ్ల స్కూల్‌మేట్ వేధించాడు. ఆ తరువాత కొడుకును ఇంట్లో నుండి బయటకు పంపి బాలుడి తండ్రి (42) బాలిక మీద అత్యాచారం చేశాడు. మార్చి 13న ఈ దారుణమైన ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. దీనిమీద పిలిభిత్ లోని పోక్సో చట్టం ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. 18యేళ్ల బాలుడు.. రాబోయే పరీక్షకు సంబంధించిన పేపర్ తన దగ్గర ఉందని.. దాని ఫొటోకాపీ ఇస్తానని ఆ బాలికను మభ్యపెట్టాడు. అలా మార్చి 13న, బాలుడు 9వ తరగతి బాలికను పాఠశాల నుండి తన ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తరువాత ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిన ఆ బాలిక గట్టిగా కేకలు వేసింది.
ఆ కేకలు విన్న బాలుడి తండ్రి బాలుడి గదిలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. కొడుకును కోప్పడి బయటికి పంపించేశాడు. ఆ తరువాత ఆ చిన్నారికి రక్షణ కల్పించాల్సింది పోయి.. కొడుకు చేసిన పనిని పొడిగించాడు. అరవకుండా ఆమె నోటిని స్కార్ఫ్ తో కట్టేసి, ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. లైంగిక వేధింపుల గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబానికి తెలిపింది.
దీంతో 14వతేదీ బాధితురాలి అత్త ఈ ఘటన మీద పీఎస్ లో కేసుపెట్టింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలుడి తండ్రి బెదిరించాడని బాధితురాలి అత్త తన ఫిర్యాదులో పేర్కొంది.బాలిక అత్త మొదట మార్చి 14న లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆమె ఫిర్యాదుపై ఎటువంటి చర్యా తీసుకోలేదు. దీంతో, మార్చి 17న పోలీసు సూపరింటెండెంట్ అతుల్ శర్మకు లేఖ రాసింది.
"మీ డిగ్రీని చూపించండి" ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ.. వినూత్న ప్రచారానికి తెర తీసిన ఆప్
పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని అత్త ఆదివారం తెలిపింది. ఆమె ఇంకా మాట్లాడుతూ "ఆ దుర్మార్గుల బారినుంచి తప్పించుకుని నా మేనకోడలు ఎలాగోలా ఇంటికి చేరుకుంది. తనకు జరిగిందంతా వివరించింది. ఆమె తీవ్రంగా గాయపడింది. భయంతో మాట్లాడలేకపోయింది" అని చెప్పుకొచ్చింది.
కోర్టు ఆదేశాల తర్వాత, ఎస్ హెచ్ఓ నరేష్ త్యాగి మాట్లాడుతూ, "ఇద్దరు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 341 (ఒక వ్యక్తిని తప్పుగా నిరోధించడం), 376 (అత్యాచారం), 354 (ఆమె నమ్రతను అగౌరవపరిచే ఉద్దేశ్యంతో ఒక మహిళపై క్రిమినల్ ఫోర్స్ ప్రయోగించడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) లాంటి పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. వారిని త్వరలో అరెస్టు చేస్తాం" అని తెలిపారు.
మైనర్‌పై అత్యాచారానికి సంబంధించిన కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించడం జిల్లాలో వారం రోజుల్లో ఇది రెండో ఘటన. ఏప్రిల్ 5న, మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె తల్లిని వేధించినందుకు 45 ఏళ్ల వ్యక్తి, అతని సహాయకుడిపై పోలీసులు కోర్టు ఆదేశాల తర్వాత కేసు నమోదు చేశారు.
(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయలేదు)
