Asianet News TeluguAsianet News Telugu

భారత అభివృద్ధిని ఏ కరోనా అడ్డుకోలేదు: ఎర్రకోట ప్రసంగంలో మోడీ

74వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట మీద జెండా ఎగురవేసి భారతీయులందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా పై పోరులో ముందు వరసలో ఉన్న కోవిడ్ యోధులందరికి ధన్యవాదాలు తెలిపారు. 

74th Independence day celebrations 2020: live updates
Author
New Delhi, First Published Aug 15, 2020, 7:54 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

74వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట మీద జెండా ఎగురవేసి భారతీయులందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా పై పోరులో ముందు వరసలో ఉన్న కోవిడ్ యోధులందరికి ధన్యవాదాలు తెలిపారు. 

2022 లో భారతదేశం 75వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటుందని, కరోనా మహమ్మారి అయినప్పటికీ.... భారత అభివృద్ధిని ఆపలేదని ప్రధాని మోడీ అన్నారు. భారత్ మాత కి జై, వందేమాతరం అంటూ ప్రసంగాన్ని ముగించారు. 

ఐరాస లో 192 దేశాల్లో 184 దేశాలు భారత్ కు మద్దతు పలికాయని, ఇదంతా భారత దేశం ఏర్పరుచుకున్న శతసంబంధాల వల్ల, భారతీయ వైజ్ఞానిక శక్తి వాళ్ళ, అన్ని రంగాల్లో భారత్ తన శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకుంటూ ముందుకు పోతుందనడానికి ఇదే రుజువు అని మోడీ అన్నారు. 

భారతీయ సైనికులు భారతీయ సరిహద్దులను కాచి కాపాడుతున్నారని, ఎల్ఓసి నుంచి ఎల్ఏసి వరకు ఎవరు వేలెత్తి చూపినా మన సైనికులు వారి భాషలోనే వారికి సమాధానం చెబుతారని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా సైనికులందరికీ భారతీయులందరి తరుఫున ప్రణామం చేస్తున్నానని ప్రధాని అన్నారు. 

కరోనా వాక్సిన్ గురించి మాట్లాడుతూ... భారతదేశంలో మూడు వాక్సిన్లు వివిధ టెస్టింగ్ దశల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తలు పచ్చ జెండా ఊపిన వెంటనే సాధ్యమైనంత తక్కువ సమయంలో భారతీయులందరికి చేరేట్టు ప్రభుత్వం చేస్తుందని అన్నారు. అందుకు సంబంధించిన పూర్తి ప్లాన్ రెడీగా ఉందన్నారు. 

భారతీయ మధ్యతరగతి వర్గం కోసం తీసుకున్న అనేకమైన నిర్ణయాల గురించి ప్రస్తావిస్తూ.... వారిలో పొటెన్షియల్ ఉందని, నూతన అవకాశాల కోసం వారు వెదుకుతున్నారని, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే సత్త వారికి ఉందని అన్నారు. 

వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని మోడీ అన్నారు. ఇలా గనుక అనకపోతే... మన దేశీయ వస్తువులకు డిమాండ్ ఉండదని ప్రధాని అన్నారు. దేశీయ ఉత్పత్తుల తయారీదారులకు మనము ప్రోత్సాహకం అందించాలంటే... వోకల్ ఫర్ లోకల్ అవ్వడమొక్కటే మార్గమని అన్నారు. 

భారతదేశం ఎన్ని సంవత్సరాలు ముడి సరుకులను ప్రపంచానికి ఎగుమతి చేస్తుందని, భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఫినిష్డ్ గూడ్స్ ఎగుమతి చేయాల్సిన సమయం ఆసన్నమయిందని,  ఆత్మా నిర్భర్ భారత్ ద్వారా దేశం తనకు అవసరమైనవన్నీ తయారు చేసుకోవడంతోపాటుగా... మేక్ ఇన్ ఇండియా.... మేక్ ఫర్ వరల్డ్ అనే విధంగా రూపాంతరం చెందాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

ఆత్మ నిర్భర్ భారత్ ద్వారానే మనం ఈ కరోనా వేళ పీపీఈ కిట్లను, ఎన్ 95 మాస్కులను, ఇతర వైద్య సామాగ్రిని భారతదేశంలో తాయారు చేసుకోగలిగామని, అది ఆత్మనిర్భర్ భారత్ వల్ల మాత్రమే సాధ్యమైందని, అది భారతీయుల శక్తి అని మోడీ అన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios