పదేళ్ల బాలికను పొరుగునే ఉండే 70 ఏళ్ల వృద్ధుడు వక్ర దృష్టితో చూశాడు. తరచూ ఇంటి ముందు ఆడుతూ పాడుతూ తిరిగే ఆ బాలికను చాక్లెట్లు, బిస్కెట్ల ఆశ చూపి ఇంటికి రప్పించేవాడు. ఆమె దుస్తులు తొలగించి ప్రైవేట్ పార్ట్స్ తాకి రాక్షసానందం పొంది చాక్లెట్లు ఇచ్చేవాడు. ఆ బాధితురాలు తెరిపి లేకుండా ఏడవడంతో మే 6వ తేదీన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

ముంబయి: మహారాష్ట్రలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పదేళ్ల బాలికపై పొరుగునే ఉన్న 70 ఏళ్ల వృద్ధుడు కన్నేశాడు. రోజూ చాక్లెట్లు, బిస్కెట్ల ఆశచూపి ఇంటికి రప్పించేవాడు. ఆ తర్వాత ఆ బాలికను వివస్త్ర చేసేవాడు. ఆమె ప్రైవేటు పార్ట్స్ ముట్టుకునేవాడు. ఆ తర్వాతే బాధితురాలికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చేవాడు. ఇలా కొన్నాళ్లు జరిగింది. ఈ ఘటనలతో ఆ బాలిక కుంగిపోవడం మొదలైంది. మానసికంగా అస్థిరంగా మారడం కనిపించింది. ఒక రోజు ఇంటిలో తీవ్రంగా ఏడుస్తూ ఉంటే బాలిక తల్లికి అనుమానం వచ్చింది. ఏం జరిగిందో చెప్పాలని గట్టిగా అడిగింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ముంబయిలోని బైకుల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్రిపద పోలీసు స్టేషన్ అధికారుల వివరాల ప్రకారం, నిందితుడు తరుచూ తమ పొరుగునే నివసించే మైనర్ బాలికను ఇంటికి రప్పించేవాడు. ఆమె దుస్తులు తొలగించి ఆమె ప్రైవేటు భాగాలను తాకేవాడు. ఆ తర్వాత చాక్లెట్లు ఇచ్చేవాడు. ఇలా సుమారు నెల రోజులుగా జరుగుతూ ఉండిందనే అనే అనుమానాలు వస్తున్నాయి.

మే 6వ తేదీన ఆ బాలిక ఇంటికి వచ్చి తీవ్రంగా ఏడవడం మొదలుపెట్టింది. ఏం అడిగినా చెప్పడానికి నిరాకరించింది. తల్లి పలుమార్లు ఆమెను అడిగింది. గట్టిగా కోప్పడటంతో ఆ బాలిక నోరు విప్పింది. ఈ విషయం తెలియగానే బాలిక తల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశఆరు. పోక్సో చట్టంలోని పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అత్యాచార నేరంలోని సెక్షన్‌నూ కేసుకు చేర్చే అవకాశం ఉన్నది.

కాగా, బాలికపై molestationకి పాల్పడిని ఇద్దరు వృద్ధులను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని మధురైకి సమీపంలో ఓ ప్రాంతానికి చెందిన 15యేళ్ల బాలిక father చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటోంది. ఆకస్మికంగా బాలికకు Stomach ache రావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆమె ఐదు నెలల Pregnant అని నిర్థారించారు. బాధితురాలి తల్లి జరిగిన విషయం గురించి ఆరా తీసింది. 

ఇంటికి సమీపంలో ఉంటున్న బాలమురుగన్ అనే వృద్ధుడు బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. ఈ విషయం గురించి తెలుసుకున్న తండ్రి స్నేహితుడైన రమేష్ అనే వ్యక్తి కూడా అఘాయిత్యానికి ఒడిగట్టాడని వెల్లడయ్యింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిద్దరినీ శుక్రవారం పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.