ఇండిగో ఫైట్ లో మెడికల్ ఎమర్జెన్సీ .. అత్యవసరంగా ఇండోర్ లో ల్యాండింగ్ .. పేషంట్ ను ఆస్పత్రికి తరలించే లోపే..
ఇండిగోకు చెందిన మదురై-ఢిల్లీ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇండోర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. ఓ ప్రయాణికుడి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదురై నుంచి ఢిల్లీ వెళ్లే విమానాన్ని ఇండోర్‌లో అత్యవసరంగా దింపాల్సి వచ్చింది.

ఇండిగోకు చెందిన మదురై-ఢిల్లీ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇండోర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతని నోటి నుండి రక్తం రావడం మొదలైంది. ఆ ప్రయాణీకుడి పరిస్థితి విషమించడంతో మదురై నుంచి ఢిల్లీ వెళ్లే విమానాన్ని ఇండోర్‌లో అత్యవసరంగా దింపాల్సి వచ్చింది. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
సమాచారం ప్రకారం, అతుల్ గుప్తా (60) ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం (6E-2088)లో ప్రయాణిస్తున్నాడు. ప్రయాణంలో అతని పరిస్థితి క్షీణించింది. అతని నోటి నుండి రక్తం రావడం మొదలైంది. అతని పరిస్థితి చూసి మధురై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని ఇండోర్‌కు మళ్లించారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో విమానాన్ని విమానాశ్రయంలో దించారు. ఆ ప్రయాణీకుడిని విమానాశ్రయం నుంచి వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అయితే.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని ఓ అధికారి తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లిన వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. అతను అప్పటికే గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నాడు. మృతుడు అతుల్ గుప్తా.. నోయిడా నివాసి అని తెలుస్తుంది. సాయంత్రం 6:40 గంటలకు విమానం న్యూఢిల్లీకి బయలుదేరిందని అధికారి తెలిపారు. ఈ కేసులో అతుల్ గుప్తా నోయిడా నివాసి అని ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.