కారు అదుపు తప్పి కాలువలో పడి... ఒకే కుటుంబానికి  చెందిన ఆరుగురు కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కోయంబత్తూరు నుంచి పొల్లాచి  వెళ్తున్న కారు అదుపు తప్పి పరంబికుళం అల్లైర్  కాలువలో పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు మృత్యువాత పడ్డారు. 

మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. డ్రైవర్  కారు వేగాన్ని నియంత్రించడంలో విఫలం కావడం వల్లే ప్రమాదం వాటిల్లింది. మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం పొల్లాచి జనరల్ హాస్పిటల్‌ కి తరలించారు . ఈ మేరకు కేసు నమోదు చేసుకొన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.