బెంగుళూరు:  కర్ణాటక రాష్ట్రంలోని కర్వార్‌లో సోమవారం నాడు పడమ మునిగిన ప్రమాదంలో  8 మంది మృతి చెందారు. ఈ ఘటన జరిగిన సమయంలో  పడవలో 24 మంది ప్రయాణం చేస్తున్నారు.

కూర్మగూడజత్రాలో జరుగుతున్న ఓ జాతరకు హాజరై తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతదేహాలను వెలికితీశారు. మరో 17 మందిని సురక్షితంగా బయటకు తీశారు.  విషయం తెలిసిన వెంటనే మత్స్యకారులు, కోస్ట్‌గార్డ్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు.

ఇదే జిల్లా నుండి చట్టసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న రూపాలీ నాయక్  మరో బోట్ లో తిరిగి వస్తున్న సమయంలో ఈ బోటు ప్రమాదానికి గురైంది. ఈ బోటు ప్రమాదానికి చట్టసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న రూపాలి నాయక్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు.