తల్లి తన శిశువుకు పాలిస్తుంటే.. ఇంటి పైకప్పు తొలగించి దొంగతనంగా చూశాడో వ్యక్తి. అతడిని ఆ మహిళ కుటుంబసభ్యులు హత్యచేశారు.
తమిళనాడు : తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కోయంబత్తూరులోని సాయిబాబా కాలనీ సమీపంలో మంగళవారం అర్థరాత్రి ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. అతను తమ పక్కింటి పైకప్పు పలకలను తొలగించి, తన పొరుగువ్యక్తి భార్య బిడ్డకు పాలివ్వడాన్ని దొంగతనంగా చూశాడు. దీంతో ఆ 58 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపారు. ఆ వ్యక్తి ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి సాయిబాబా కాలనీ పోలీసులు మహిళ భర్త, అతని అన్న, అతని స్నేహితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహిళ కుటుంబం అద్దె ఇంట్లో ఉంటోంది. రాత్రి 11.30 గంటల సమయంలో తన బిడ్డకు పాలు ఇస్తుంది. ఆ సమయంలో ఇంటి పైకప్పుపై శబ్దం కావడంతో.. తలెత్తి చూడగా.. అక్కడ ఓ వ్యక్తి పైకప్పు పెంకులు తొలగించి చూడడం కనిపించింది. వెంటనే ఆమె కేకలు వేసింది.
ఛీ.. వీడు కొడుకేనా... తల్లిపై రెండుసార్లు అత్యాచారం.. కామాంధుడికి జీవిత ఖైదు...
"ఆమె గట్టిగా కేకలు వేయడంతో ముస్తాక్ అనే ఆ నిందితుడు పారిపోయాడు. తన ఇంటికి వెళ్లి తాళం వేసుకున్నాడు. మహిళ భర్త ఎం రాహుల్ (24), కవుండంపాళయం వద్ద ఎంజీఆర్ నగర్ కు చెందిన అతని సోదరుడు ఎం మూర్తి (27), కవుండంపాళయం వద్ద అంబేద్కర్ నగర్ కి చెందిన వారిస్నేహితుడు జి మనోజ్(26)లు వెంటనే ముస్తాక్ అద్దె ఇంటి తలుపులు పగులగొట్టారు.అతడిని ఇంట్లోనుంచి బయటకు లాగి విచక్షణారహితంగా కొట్టడం ప్రారంభించారు" అని అధికారి తెలిపారు.
గలాటాతో బయటికి వచ్చిన ఇతర పొరుగువారు ముగ్గురిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముస్తాక్‌పై ఫిర్యాదు చేయడానికి రాహుల్ , అతని కుటుంబ సభ్యులను బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కి రావాలని తెలిపారు.
అయితే, బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ముస్తాక్ వారి ఇంటి సమీపంలోని మురుగునీటి కాలువలో మృతి చెంది ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
