Asianet News TeluguAsianet News Telugu

పశ్చిమ బెంగాల్ లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి

సంఘటనా స్థలానికి చేరిన రక్షక బృందాలు,అగ్నిమాపక  బృందాలు, సహాయక చర్యల్ని పర‍్యవేక్షిస్తున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి.
 

5 Killed In Blast At Plastic Factory In West Bengal's Malda
Author
Hyderabad, First Published Nov 19, 2020, 3:54 PM IST

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం మాల్డా జిల్లాలో ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో గురువారం నాడు భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడిక్కడే  ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.  సంఘటనా స్థలానికి చేరిన రక్షక బృందాలు,అగ్నిమాపక  బృందాలు, సహాయక చర్యల్ని పర‍్యవేక్షిస్తున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి.

 ఉదయం 11 గంటల సమయంలో సుజాపూర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు, గాయపడిన వారికి రూ .50 లక్షలు ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. సీనియర్ మినిస్టర్ ఫర్హాద్ హకీమ్ వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పెద్ద ఎత్తున పోలీసులను, బలగాలను సంఘటనా ప్రాంతానికి తరలించారు.  కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కాగా..పరిస్థితిని అదుపు చేసేందుకు భారీ పోలీసు బృందాలను పంపించామన్నారు. అగ్నిమాపక  శకటాలు మంటలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాయనీ, ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన  చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios