Asianet News TeluguAsianet News Telugu

తేజస్వీ యాదవ్ కు వెల్లువెత్తుతున్న పెళ్లి సంబంధాలు.. క్యూలో 44 వేలమంది..

బీహార్ రాజకీయాల్లో తేజస్వీ యాదవ్ ఇప్పుడు హట్ టాపిక్ గా మారారు. తేజస్వీ యాదవ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కూడా. అందుకే ఆయనను పెళ్లి చేసుకుంటామంటూ కుప్పలు తెప్పలుగా సంబంధాలు వచ్చిపడుతున్నాయట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 44వేల పెళ్లి సంబంధాలు వచ్చాయంటే తేజస్వీ ఛరిష్మా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటివిషయం కాదట. 

44000 Marriage Proposals For Tejaswi Yadav - bsb
Author
hyderabad, First Published Nov 12, 2020, 3:08 PM IST

బీహార్ రాజకీయాల్లో తేజస్వీ యాదవ్ ఇప్పుడు హట్ టాపిక్ గా మారారు. తేజస్వీ యాదవ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కూడా. అందుకే ఆయనను పెళ్లి చేసుకుంటామంటూ కుప్పలు తెప్పలుగా సంబంధాలు వచ్చిపడుతున్నాయట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 44వేల పెళ్లి సంబంధాలు వచ్చాయంటే తేజస్వీ ఛరిష్మా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటివిషయం కాదట. 

బీహార్ 2020 ఎన్నికల్లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్ బంధన్ అధికారానికి అడుగు దూరంలో నిలిచిపోయంది. అయినా రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. పార్టీకి పెద్ద దిక్కు లాల ప్రసాద్ యాదవ్ అందుబాటులో లేకపోయినా ఈ ఎన్నికల్లో మంచి ఫలితానే సాధించింది. ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ తండ్రి లాలూ నీడనుంచి బైటికి వచ్చి తనకంటూ ఓ గుర్తింపు సాధించుకన్నారు. నితీష్ పై పదునైన అవినీతి ఆరోపణలు చేస్తూ భవిష్యత్తులో భాజాపాను ఎదుర్కోగలననే సందేశం పంపారు.

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రెండో కొడుకుగా తేజస్వీ యాదవ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తేజస్వీ చిన్నప్పటినుండి క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. క్రికెట్ మీదున్న ఇష్టంతో తొమ్మిదో తరగతిలోనే చదువు మానేశాడు. ఝార్ఖండ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. 2008-12 ఐపీఎస్ సీజన్ లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. తేజస్వీ రాజకీయనాయకుడవుతారని ఎవ్వరూ ఊహించలేదు. 

కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కి తన కొడుకు మీద బాగ నమ్మకం. అందుకే 2009లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేయించాడు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ రాఘోపూర్ నుంచి గెలిచాడు. నితీశ్ కుమార్ ను సీఎంగా ప్రకటించే విషయంలో తండ్రికి బహిరంగంగానే మద్దతిచ్చాడు. దీంతో లాలూ తన వారసుడిగా తేజ్వీని నిర్ణయించాడు. దీంతో నితీష్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశాడు తేజస్వీ. 

ఈ సమయంలో రోడ్లకు సంబంధించిన సమస్యలుటే నేరుగా తనకే పంపాలని తన వాట్సప్ నెంబర్ షేర్ చేశాడు తేజస్వీ యాదవ్. అయితే ఫిర్యాదులు కాదు కానీ పెళ్లి ప్రపోజల్స్ వేలల్లో వచ్చి పడ్డాయి. దాదాపుగా 44వేల పెళ్లి సంబంధాలు వచ్చాయి. 

తేజస్వికి అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నాడు. ఆయన కూడా తేజస్వీ తరువాత రాజకీయాల్లోకి వచ్చి 2015లో మహువా నుండి గెలిచాడు. 2019 ఎన్నికల సమయంలో అన్నాతమ్ములు, సోదరి మీసా భారతితో విభేదాలు వచ్చాయి. ఈ గొడవల ఫలితం పార్టీపై పడింది. అంతే 2019 ఎన్నికల్లో ఆర్జేడీకి ఒక్క సీటు కూడా రాలేదు. 2020 నాటికి పరిస్థితులు మారిపోయాయి. తేజస్వీ శక్తి వంతమైన నేతగా ఎదిగాడు. వాగ్ధాటితో ప్రత్యర్థిపై దాడి చేశాడు. దీంతో ఆర్జేజీ బీహార్ లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios