జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను భారత భద్రత బలగాలు మట్టుబెట్టాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను భారత భద్రత బలగాలు మట్టుబెట్టాయి. పూంచ్‌లోని సింధారా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా సైన్యం, పోలీసులు ..సోమవారం రాత్రి సూరంకోట్ బెల్ట్‌లోని సింధారా టాప్ ఏరియాలో జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే ఇది భద్రత బలగాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులకు దారితీసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సోమవారం రాత్రి 11:30 గంటలకు భద్రతా బలగాల మధ్య తొలుత కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత డ్రోన్‌లతో పాటు ఇతర రాత్రి నిఘా పరికరాలను భద్రత బలగాలు మోహరించాయి. అయితే మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు, కాల్పులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. 

Scroll to load tweet…

‘‘తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరగడంతో మళ్లీ ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. భారత సైన్యం ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసు దళాలతో పాటు ఇతర దళాలు ఈ ఆపరేషన్‌లో భాగంగా ఉన్నాయి. ఈ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదులు విదేశీ ఉగ్రవాదులే. వారి గుర్తింపును పరిశీలిస్తున్నాం’’ అని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఇంకా ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా పేర్కొంది.