Asianet News TeluguAsianet News Telugu

కరెంట్ పని చేస్తామని చెప్పి... వ్యాపారి ఇంట్లో దోపిడీ..!

రెండు స్కూటర్లపై ఇంటికి వచ్చారు. తమ ముఖాలు కనిపించకుండా మాస్క్ లతో కవర్ చేసుకున్నారు. వారిలో ఒకరు హెల్మెట్, మరొకరు క్యాప్ పెట్టుకొని వచ్చారు.

4 Posing As Electricians Hold Family Hostage, Loot Valuables Worth Lakhs
Author
Hyderabad, First Published Jul 8, 2021, 9:06 AM IST

తమను తాము ఎలక్ట్రీషియన్స్ గా నమ్మించి.. ఆయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి.. ఓ వ్యాపారి ఇంటిని లూటీ చేశారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రాపర్టీ డీలర్ ఇంట్లో  పెద్ద లూటీ జరిగింది. నలుగురు ఆయుధాలతో సహా వారి ఇంటికి వచ్చి ఈ దోపిడీ చేశారు. ఇంట్లోని లక్షల రూపాయల నగుదును దోచుకెళ్లారు. ఎలక్ట్రీషియన్ పని నిమిత్తం వచ్చామంటూ నమ్మించి.. ఈ దోపిడీకి పాల్పడం గమనార్హం.

మధ్యాహ్నం సమయంలో.. రెండు స్కూటర్లపై ఇంటికి వచ్చారు. తమ ముఖాలు కనిపించకుండా మాస్క్ లతో కవర్ చేసుకున్నారు. వారిలో ఒకరు హెల్మెట్, మరొకరు క్యాప్ పెట్టుకొని వచ్చారు.

నిందితుల వయసు దాదాపు 20-30 మధ్యలో ఉంటుందని వారు చెబుతున్నారు.  ఇంటి యజమాని వినోద్ లేని సమయంలో వీరు అక్కడికి రావడం గమనార్హం.ఈ క్రమంలో  ఇంట్లోవారిని బంధించి... దాదాపు రూ.8లక్షల విలువచేసే బంగారు ఆభరణాలను చోరీ చేశారు. 

ముందుగా.. తుపాకీ తో బెదిరించి మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ చేశారు. ఆ తర్వాత ఇంట్లో దాచి ఉన్న ఇతర నగలను కూడా దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios