వారికి పెళ్లై చక్కటి సంసారం ఉంది. అందమైన భార్య, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా అతని మనసు పరస్త్రీ వైపు లాగింది. భర్త తనని కాదని మరో స్త్రీ వ్యామోహంలో పడిపోవడ ఆమెను ఎంతగానో కుంగదీసింది. తట్టుకోలేక రాత్రి నిద్రపోతున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసేసింది. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయిలోని నల్లసొపర ప్రాంతంలో నివాసముంటున్న సునీల్, ప్రణలికి పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. గత కొంత కాలంగా సునీల్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో అతనిపై నిఘా పెట్టింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భర్తపై పగ తీర్చుకోవాలని భావించిన ప్రణలి భావించింది.

అందుకు అనుగుణంగా పథకం వేసింది. రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో మంచినీరు తాగే నెపంతో కిచెన్ లోకి వెళ్లింది. తిరిగి వచ్చేటప్పుడు తన వెంట కత్తి తెచ్చుకుంది. ఘాడ నిద్రలో ఉన్న భర్తను 11సార్లు కత్తితో పొడిచింది. తర్వాత గొంతు కోసి హత్య చేసింది. అయితే తన భర్తే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు చెప్పింది.

ఎవరూ తనను తాను 11సార్లు పొడుచుకొని ఆత్మహత్య చేసుకోరని అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను గట్టిగా విచారించగా.. అసలు నిజాన్ని బయట పెట్టింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.