డెహ్రాడూన్‌లో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై 11 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని దలన్‌వాలా ప్రాంతంలో ఒక వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.

డెహ్రాడూన్‌లో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై 11 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని దలన్‌వాలా ప్రాంతంలో ఒక వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.

వీరి ఇంటికి పక్కనే ఉండే 11 ఏళ్ల బాలుడు.. మంగళవారం ఇంట్లో ఎవరు లేరని సమయంలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిని స్వీట్లు, చాక్లెట్లు కొనిస్తానని బయటకు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం పాపను ఇంటి వద్ద వదిలిపెట్టాడు. సాయంత్రం చిన్నారి తల్లి ఇంటికి తిరిగి రావడంతో... ఆమె తనపై జరిగిన దారుణాన్ని చెప్పింది. దీంతో పాప తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. చిన్నారిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మరో వైపు ఈ సంఘటనపై స్థానికులు భగ్గుమన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగారు.