Asianet News TeluguAsianet News Telugu

నాగపూర్ సెంట్రల్ జైలులో కోవిడ్ కలకలం

నాగపూర్‌ సెంట్రల్ జైలులో మరోసారి కరోనా కలకలం రేగింది. అక్కడ శిక్ష అనుభవిస్తున్న మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహా మరో ముగ్గురు కరోనా బారిన పడ్డారు.

3 prisoners tested corona positive for nagpur central jail ksp
Author
Nagpur, First Published Feb 13, 2021, 6:12 PM IST

నాగపూర్‌ సెంట్రల్ జైలులో మరోసారి కరోనా కలకలం రేగింది. అక్కడ శిక్ష అనుభవిస్తున్న మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహా మరో ముగ్గురు కరోనా బారిన పడ్డారు.

సాయిబాబాకు శుక్రవారం పాజిటివ్‌గా తేలిందని , సిటీ స్కాన్ ఇతర పరీక్షల కోసం ఆయనను తీసుకువెళ్లనున్నామని జైలు సూపరింటెండెంట్ అనుప్ కుమార్‌ కుమ్రే తెలిపారు. అలాగే చికిత్స కోసం ప్రభుత్వ వైద్య కళాశాల లేదా ఆసుపత్రికి తరలించాలా అనేది వైద్యులు నిర్ణయిస్తారని ఆయన చెప్పారు.

90 శాతం అంగవైకల్యం, ఇప్పటికే జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా ఆరోగ్యంపై తీవ్ర అందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఇదే జైల్లో ఉంటున్న గ్యాంగ్‌స్టర్‌ అరుణ్‌ గావ్లీతో పాటు మరో ఐదుగురికి కోవిడ్‌-19గా తేలింది. 

కాగా మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై యుఏపీఏ చట్టం కింద ప్రొఫెసర్ సాయిబాబాకు నాగపూర్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

దీంతో 2017 మార్చి నుంచి ఆయన నాగ‌పూర్‌ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వికలాంగుడైన సాయిబాబాను మానవతా దృక్ఫథంతో విడుదల చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios