ముంబైలోని భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్‌వీర్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఐఎన్ఎస్ రణ్‌వీర్ అంతర్జాతీయ సరిహద్దు జలాల్లో విధులు నిర్వర్తిస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జాతీయ మీడియా సంస్థ కథనాల ప్రకారం.. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడగా వీరందరినీ నౌకాదళ ఆసుపత్రికి తరలించారు. యుద్ధనౌకలోని అంతర్గత కంపార్ట్‌మెంట్‌లో పేలుడు సంభవించడం వల్లే అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన నౌకాదళ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదం వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లుగా ఎలాంటి సమాచారం లేదు. తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి ఐఎన్ఎస్ రణ్‌వీర్ క్రాస్ కోస్ట్ ఆపరేషన్స్‌లో వుందని.. త్వరలోనే బేస్ పోర్ట్‌కు తిరిగి వస్తుందని నేవీ అధికారులు తెలిపారు. నౌకలో ప్రమాదానికి కారణాన్ని తేల్చేందుకు అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.