ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత మూడేళ్లలో గోవధ, గోవుల అక్రమ రవాణా ఆరోపణలపై 277 మందిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గో సంరక్షణ దళాల ఏర్పాటు అనంతరం 171 గోవధ కేసులు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. గోవధ, గోవుల అక్రమ రవాణ కేసుల్లో 176 మందిని గోరక్షణ బృందం కుమావున్ యూనిట్, మరో 101 మందిని గర్హ్వాల్ యూనిట్ బృందం పట్టుకుందని డీజీపీ వివరించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గోరక్షణ బృందాల పనితీరును డీజీపీ అశోక్ కుమార్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా తాజాగా సమీక్షించారు.

ఆవుల అక్రమ రవాణాకు పాల్పడేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. ప్రతీ జిల్లాలో చట్టవిరుద్ధమైన కబేళాల జాబితాను సిద్ధం చేయాలని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు.ఆవులను వధించడం, వాటిని అక్రమంగా రవాణ చేయడాన్ని నిషేధిస్తూ 2017 అక్టోబరు 21వతేదీన ఉత్తరాఖండ్ సర్కారు చట్టం చేసి గోరక్షణ దళాలను ఏర్పాటు చేసింది.