గత నెలలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేని పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. అంతకముందు అతనిని అరెస్టు  చేసే క్రమంలో చాలా మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఆ తర్వాత యూపీలో అలాంటి గ్యాంగ్ స్టర్ లపై పోలీసులు కన్నేసి.. ఒకరి తర్వాత మరొకరిని క్లోజ్ చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో ఆ గ్యాంగ్ స్టర్ ల చేతిలో ప్రాణాలు పోగొట్టుకోకుండా తమ వంతు జాగ్రత్తలుు తీసుకుంటూనే ఉన్నారు. అయితే.. తాజాగా.. రాజస్థాన్ ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది.

 రాజస్థాన్ కి చెందిన ఒక గ్యాంగ్ స్టర్ ఇలాగే ట్రై చేసి పోలీసులకు దొరికిపోయాడు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో నివసిస్తున్న అర్షద్ ఖాన్, ఎటిఎం దొంగతనాలకు పాల్పడుతూ ఉంటాడు. తాజాగా దక్షిణ ఢిల్లీకి వెళ్ళిన అతను ఒక ఏటీఎంని లేపేయాలి అని ప్లాన్ చేసాడు. దీనికి సంబంధించి పోలీసులకు పక్కా సమాచారం అందింది. 

సాయంత్రం 6:30 గంటల సమయంలో ఒక పోలీసు బృందం ఆ ప్రాంతంలో అతని కోసం నిఘా పెట్టింది. రాత్రి 7:30 గంటలకు గ్యాంగ్ స్టర్ కి చెందిన టయోటా సెడాన్ ను పోలీసు ఇన్ఫార్మర్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

వెంటనే అప్రమత్తమైన పోలీసులు తను లొంగిపోవాలి అని కోరగా… తన నలుగురు ముఠా సభ్యులతో కలిసి కాల్పులకు దిగాడు. పోలీసులు కూడా అదే రేంజ్ లో ఎదురు కాల్పులు జరపడంతో రెడ్ హ్యాండెడ్ గా లొంగిపోయాడు. అతనికి పోలీసు కాల్పుల్లో స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఆధ్వర్యంలోనే అతనికి చికిత్స చేస్తున్నారు.