ఇద్దరు కామాంధులు ఓ విదేశీ యువతిని బంధించి.. మూడు రోజులపాటు ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా.. చిత్రహింసలకు గురిచేశారు. దీంతో ఆమె వారి బారి నుంచి తప్పించుకునేందుకు మూడో అంతస్తు నుంచి నగ్నంగా దూకింది. 

ఇద్దరు కామాంధులు ఓ విదేశీ యువతిని బంధించి.. మూడు రోజులపాటు ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా.. చిత్రహింసలకు గురిచేశారు. దీంతో ఆమె వారి బారి నుంచి తప్పించుకునేందుకు మూడో అంతస్తు నుంచి నగ్నంగా దూకింది.

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని ముహానా ప్రాంతానికి చెందిన లోకేశ్ షైనీ, కమల్ షైనీ ఇనే ఇద్దరు యువకులు 23 ఏళ్ల నేపాలీ యువతిని బంధించారు. అనంతరం ఆమెను గదిలో ఉంచి శుక్రవారం నుంచి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడుతుండటంతో పాటు చిత్రహింసలు పెడుతున్నారు.

వారి వేధింపులు భరించలేని సదరు యువతి.. శనివారం తెల్లవారుజామున బిల్డింగ్ పై నుంచి నగ్నంగా దూకేసింది. ఆమెను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.