జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా బిజ్ బెహరలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ  ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో  భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సోదాలు చేపట్టారు.

కాగా.. సోదాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలపై  ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే స్పందించిన దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఘటనాస్థలిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.