హెలికాప్టర్ హ్యాంగర్ డోర్ విరిగిపడి.. ఇద్దరు నేవీ సిబ్బంది మృత్యువాత పడ్డారు. ఈ దారుణ సంఘటన కేరళలోని కొచ్చిలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం 9గంటల ప్రాంతంలో కొచ్చి నేవీ బేస్ పాయింట్ ఐఎన్ఎస్ గరుడలో హెలికాప్టర్ హ్యాంగర్ డోర్ విరిగిపడింది. అది వచ్చి నేవి సిబ్బందిపై పడింది.

ఈ ఘటనలో.. ఇద్దరు నేవీ సిబ్బంది తీవ్రగాయాలపాలయ్యారు. కాగా..వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై నేవీ అధికారులు విచారణకు ఆదేశించారు.