వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది.. దాదాపు70 మందిని అక్కడి నుంచి రక్షించగలిగారు. అయితే.. దురదృష్టవశాత్తు అక్కడ ఇద్దరు సజీవ దహనమయ్యారు.
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనమయ్యారు. ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి తిరగపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు ఓ పెద్ద మాల్ లో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. కాగా.. ఆ ఆస్పత్రిలో గురువారం అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
వెంటనే స్పందించిన ఆస్పత్రి సిబ్బంది.. దాదాపు70 మందిని అక్కడి నుంచి రక్షించగలిగారు. అయితే.. దురదృష్టవశాత్తు అక్కడ ఇద్దరు సజీవ దహనమయ్యారు. మిగిలిన వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన మాల్ భాండూప్ ప్రాంతంలో ఉంది.
భాండూప్‌లో ఉన్న డ్రీమ్స్ మాల్‌లో మంటలు చెలరేగాయి. ఆ మాల్‌లోని మూడో అంతస్తులో సన్‌రైజ్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆ ఆస్పత్రిలో 76 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు.
మంటల ధాటికి ఆస్పత్రిలోకి దట్టమైన పొగలు వ్యాపించాయి. పొగలతో ఊపిరాడక కరోనా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరు చనిపోయారు. మరో 76 మందిని వేరొక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది.
