Asianet News TeluguAsianet News Telugu

రెస్టారెంట్ లో ఆగి మృత్యువు అంచుల్లోకి ఆర్మీ జవాన్లు: ఇద్దరు మృతి

హిమాచల్ ప్రదేశ్ లో భవనం కూలి ఇద్దరు మరణించారు. శిథిలాల కింద 19 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిలో 12 మంది భార సైనికులు, ఏడుగురు పౌరులు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. 

2 Dead, Several Soldiers Trapped As Building Collapses In Himachal
Author
Shimla, First Published Jul 14, 2019, 8:15 PM IST

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లో భవనం కూలి ఇద్దరు మరణించారు. శిథిలాల కింద 19 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. వారిలో 12 మంది భార సైనికులు, ఏడుగురు పౌరులు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. 

శిథిలాల కింద చిక్కుకున్న కొంత మందిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని స్థానిక ఆస్పత్రులకు తరలిచారు. మృతుల్లో ఓ మహిళ, ఓ సైనికాధికారి ఉన్నారు. వారిద్దరి శవాలను వెలికి తీశారు. 

జాతీయ విపత్తుల రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందం సహాయక చర్యలు చేపట్టింది. మరో బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటోంది. 

కూలిన భవనంలో రెస్టారెంట్ ఉంది. భారీ వర్షం తాకిడికి అది కూలింది. ఉత్తరాఖండ్ కు వెళ్తూ సైనికులు, వారి కుటుంబ సభ్యులు మధ్యాహ్న భోజనం కోసం రెస్టారెంట్ లో ఆగారు. ఆ సమయంలో ప్రమాదం సంభవించింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీయడానికి సహాయక చర్యలు చేపట్టినట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ చెప్పారు  

 

Follow Us:
Download App:
  • android
  • ios