న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో సోమవారం అర్ధరాత్రి నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది.ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకొన్నారు. సహాయక చర్యలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఈశాన్య ఢిల్లీలోని నీలంపూర్ లో మంగళవారం తెల్లవారుజామున నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఓ మహిళతో పాటు ఓ పురుషుడు కూడ ఉన్నాడు. 

ఈ ప్రమాద విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. ఆరు ఫైరింజన్లతో సహాయక చర్యలను చేపట్టారు. శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

శిథిలాల కింద చిక్కుకొన్న వారిలో ఆరుగురిని అధికారులు రక్షించారు. నిర్మాణంలో ఉన్న భవనం మొదటి అంతస్థులో కొందరు స్థానికులు వేడుకలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం వాటిల్లినట్టుగా పోలీసులు తెలిపారు.