శ్రీనగర్: ఉగ్రవాదుల దాడుల్లో ఇద్దరు సీఆర్‌ఫీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన శ్రీనగర్ కి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

సోమవారం నాడు మధ్యాహ్నం ఉగ్రవాదులు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు. హైవేపై సిబ్బంది విధుల్లో ఉన్న సమయంలో ఉగ్రవాదులు భద్రతాదళాలలపై కాల్పులు జరిపినట్టుగా పోలీసులు చెప్పారు.

సమీప ప్రాంతంలోని చిత్తడి నుండి ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.టెర్రరిస్టులు తప్పించుకొన్నారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.వారి కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

ఇదే ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రమూకలు దాడులు చేయడం ఇది నాలుగోసారి. దీంతో ఇటీవల కాలంలో భద్రతా దళాలను మోహరించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.ఇదే ప్రాంతంలో సెక్యూరిటీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేయడానికి గల కారణాలపై కూడ పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రాంతంపై భద్రతా దళాలు పట్టు పెంచరుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి.