మరో ప్రేమ ఉన్మాదానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించడం లేదనే కారణంతో.. ఓ యువకుడు  యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ దారుణ సంఘటన కేరళలోని తిరువల్లలో చోటుచేసుకుంది.

ప్రత్యక్ష సాక్షులు  చెప్పిన వివరాల ప్రకారం... తిరువల్ల ప్రాంతానికి చెందిన అజిన్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని కొంత కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. కాగా.. ఆమె ప్రేమను అంగీకరించలేదనే కారణంతో ఆమెను చంపేందుకు పథకం పన్నాడు. మంగళవారం మాట్లాడాలని చెప్పి.. పిలిచి.. రోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.

స్థానికులు స్పందించి యువతిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆమెకు 60శాతం కాలిన గాయాలైనట్లు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం యువతి చికిత్స పొందుతోంది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రేమే ఈ దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.