Asianet News TeluguAsianet News Telugu

బీహార్: ప్రసాదం తిని 170 మందికి అస్వస్థత

బీహార్ విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ముంగేర్ జిల్లాలో 'ప్రసాదం తిని 170 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. బీహార్‌లోని ముంగేర్ జిల్లాలోని కోత్వన్ గ్రామంలో ఫుడ్ పాయిజిన్ కారణంగా కనీసం 170 మంది అనారోగ్యానికి గురయ్యారని వైద్య అధికారులు వెల్లడించారు

170 people fall sick after consuming prasad in bihar munger district KSP
Author
Bihar, First Published Jul 6, 2021, 3:49 PM IST

బీహార్ విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ముంగేర్ జిల్లాలో 'ప్రసాదం తిని 170 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. బీహార్‌లోని ముంగేర్ జిల్లాలోని కోత్వన్ గ్రామంలో ఫుడ్ పాయిజిన్ కారణంగా కనీసం 170 మంది అనారోగ్యానికి గురయ్యారని వైద్య అధికారులు వెల్లడించారు. సోమవారం జరిగిన  ఒక మతపరమైన కార్యక్రమంలో 'చార్నమ్రిత్ ప్రసాద్' తిని 170 మంది అనారోగ్యానికి గురయ్యారు. దీనిపై సివిల్ సర్జన్ డాక్టర్ హరేంద్ర కుమార్ అలోక్ మాట్లాడుతూ 'ప్రసాద్' కలుషితమై ఉండొచ్చని పేర్కొన్నారు. 80 మంది ఇంకా చికిత్సలో ఉన్నారని, అయితే ఎవరికీ హానీ కలగలేదని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios