Asianet News TeluguAsianet News Telugu

పుణె కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: 15 మంది మృతి

మహారాష్ట్రలోని పుణెలో సోమవారం నాడు ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.

15 killed 5 missing in fire at a company in Punes Pirangut lns
Author
Pune, First Published Jun 7, 2021, 7:46 PM IST

పుణె:మహారాష్ట్రలోని పుణెలో సోమవారం నాడు ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. కెమికల్ ఫ్యాక్టరీలో  జరిగిన అగ్నిప్రమాదంలో 15 మంది కార్మికులు  మృతి చెందారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మంటల్లో ఇద్దరు కార్మికులు చిక్కుకొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన 12 మంది కార్మికుల మృతదేహాలను  అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు.  మరో మూడు మృతదేహాలు లభ్యం కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. 

ఈ ప్రమాదంలో 17 మంది చిక్కుకొన్నారు. వీరిలో 15 మంది మహిళలు, ఇద్దరు పురుషులుగా అనుమానిస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టడానికి కూడ కష్టంగా ఉందని అధికారులు చెబుతున్నారు.  ఫ్యాక్టరీలో ఇవాళ సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫైరింజన్లు మంటలను ఆర్పాయి.  మొత్తం 8 ఫైరింజన్లు  మంటలను ఆర్పాయి.  షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంబవించిందని భావిస్తున్నామని  ఎస్‌వీఎస్ అక్వా డైరెక్టర్ ఎస్వీఎస్  నీకుంజ్ షా చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios