Asianet News TeluguAsianet News Telugu

జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు: గ్రేనేడ్ దాడి, 15 మందికి గాయాలు

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లోని ఓ బస్టాండ్ సమీపంలోని హోటల్ ప్లాజా వద్ద వారు గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు.. క్షతగాత్రులను శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

15 Injured In Grenade Attack In Jammu And Kashmir
Author
Srinagar, First Published Oct 28, 2019, 7:51 PM IST

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లోని ఓ బస్టాండ్ సమీపంలోని హోటల్ ప్లాజా వద్ద వారు గ్రేనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు.. క్షతగాత్రులను శ్రీనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

గ్రేనేడ్ దాడితో అప్రమత్తమైన భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. పేలుడు జరిగిన ప్రాంతాన్ని సీఆర్‌పీఎఫ్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాగా ఆదివారం శ్రీనగర్‌లోని సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ముష్కరులు జరిపిన గ్రేనేడ్ దాడిలో ఆరుగురు జవాన్లు గాయపడిన సంగతి తెలిసిందే. 

బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత సైన్యం మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ శతఘ్నులతో బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో నలుగురు పాక్ సైనికులతో పాటు 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

Also Read:పీఓకేలో భారత్ మెరుపు దాడి: ఉగ్రస్ధావరాలు ధ్వంసం... తీవ్రవాదులు హతం

భారత సైన్యం దాడిలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన పోస్టులు కూడా ధ్వంసమైనట్లు సమాచారం. తంగ్థార్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది.

కుప్వారాలోని తాంగ్థర్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పుల విరమణకు పాల్పడటంతో ఇద్దరు భారత సైనికులు, ఓ పౌరుడు మరణించారు. ఈ ఘటనతో భారత సైన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. పాక్‌ను దెబ్బకు దెబ్బ తీయాలని భావించి కొద్ది గంటల్లోనే భారీ ఆపరేషన్‌ను ప్రారంభించింది.

జమ్మూకాశ్మీర్ లోని ప్రజలు స్వీయ నిర్బంధాన్ని వీడి బయటకు రావాలని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రప్రభుత్వం అక్కడి ప్రజలకు పిలుపునిచ్చింది. శుక్రవారంనాడు ఈ విషయమై అక్కడి అన్ని ప్రాంతీయ దినపత్రికల్లో ఒక ప్రకటనను జారీ చేసింది. 

ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత దశలవారీగా ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేస్తూ ప్రజలను బయటకు రావలిసిందిగా పిలుపునిస్తున్నా, పూర్తి స్థాయిలో బంద్ పాటించాలన్న ఉగ్రవాదుల బెదిరింపులకు ప్రజలు భయపడుతున్నారు. దీనితో తమకు తాము స్వీయ నిర్బంధం విధించుకొని ఇండ్లకే పరిమితమవుతున్నారు. 

ప్రజలెవ్వరూ వీధుల్లోకి రాకపోవడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలెవ్వరూ ఇలా వీధుల్లోకి రాకపోవడంతో, దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు కాశ్మీర్ విషయంలో భారతదేశంపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారు. ఈ నిర్మానుష్యమైన ప్రదేశాలను చూపిస్తూ, కాశ్మీర్ లో ఇంకా అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయని విషాన్ని కక్కుతున్నారు. 

Also Read:"ఉగ్రవాదులకు లొంగిపోదామా?": ప్రజలకు కాశ్మీర్ ప్రభుత్వ సూటి ప్రశ్న

ఇలాంటి విషప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని భావించిన ప్రభుత్వం స్పందించింది. ప్రజలందరూ  బయటకు రావాలని పిలుపునిచ్చింది. ప్రజలు ఇలా బయటకు రాకపోవడాన్ని అభివృద్ధికి ఆటంకంగా అభివర్ణిస్తూ ప్రభుత్వం ఈ ప్రకటన జారీ చేసింది. 

70 ఏళ్లుగా ప్రజలు మోసపోయారని, విషప్రచారానికి బలయ్యారని ఆ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. "ఉగ్రవాదులకు లొంగిపోదామా?" అంటూ ప్రజలను ప్రశ్నించింది. వేర్పాటువాదుల పిల్లలు విదేశాల్లో విద్యనభ్యసిస్తుంటే, ఇక్కడివారు మాత్రం పేదరికం, హింస, ఉగ్రవాదంలో కూరుకుపోయారని ప్రకటనలో పేర్కొన్నారు. 

ఇప్పటికీ, అదే ధోరణిని కొనసాగిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఇంకా అవే బెదిరింపులకు లొంగిపోదామా? మన వ్యాపారాలను మనమే స్తంభింపచేసుకుందామా? మన జీవనభృతిని మనమే నిలిపేసుకుందామా? మన పిల్లల విద్యకు మనమే ఆటంకం కలిగించడమంటే, వారి జీవితాన్ని మనమే చేజేతులా నాశనం చేసినట్టే అని ప్రభుత్వం ఆ ప్రకటనలో ప్రజలను చైతన్యపరిచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios