Asianet News TeluguAsianet News Telugu

పీఓకేలో భారత్ మెరుపు దాడి: ఉగ్రస్ధావరాలు ధ్వంసం... తీవ్రవాదులు హతం

బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత సైన్యం మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ శతఘ్నులతో బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో నలుగురు పాక్ సైనికులతో పాటు 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. 

Indian Army has launched attacks on terrorist camps In POK
Author
New Delhi, First Published Oct 20, 2019, 3:03 PM IST

బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత సైన్యం మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ శతఘ్నులతో బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో నలుగురు పాక్ సైనికులతో పాటు 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

భారత సైన్యం దాడిలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన పోస్టులు కూడా ధ్వంసమైనట్లు సమాచారం. తంగ్థార్ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది.

కుప్వారాలోని తాంగ్థర్ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పుల విరమణకు పాల్పడటంతో ఇద్దరు భారత సైనికులు, ఓ పౌరుడు మరణించారు. ఈ ఘటనతో భారత సైన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. పాక్‌ను దెబ్బకు దెబ్బ తీయాలని భావించి కొద్ది గంటల్లోనే భారీ ఆపరేషన్‌ను ప్రారంభించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై పుల్వామా వద్ద సీఆర్‌పీఎఫ్ వాహన శ్రేణిపై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్ద ఆత్మహుతి దాడికి పాల్పడటంతో 40 మంది జవాన్లు అమరులయ్యారు.

దీనిపై యావత్ దేశం రగిలిపోవడం.. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిందేనంటూ ఊగిపోతున్న సమయంలో భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు గాను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించింది.

సరిహద్దుల్లో గస్తీ తిరుగుతున్న పాక్ యుద్ధ విమానాల దృష్టి మరల్చేందుకు గాను ఐఏఎఫ్ ‘‘డికాయ్ ప్యాకేజ్ (ఉత్తుత్తి దాడి బృందం)ను ఏర్పాటు చేసింది. ఎయిర్ స్ట్రైక్స్‌ కోసం కావాల్సిన యుద్ధ విమానాలన్నీ సరిహద్దుల వెంబడి ఉన్న వైమానిక స్థావరాల నుంచి కాకుండా దూరంగా ఉన్న ఢిల్లీ, ఆగ్రా, గ్వాలియర్, బరేలి నుంచి బయలుదేరాయి.

డికాయ్ ఆపరేషన్ భాగంగా పాక్ గస్తీ విమానాల కంట్లో పండేందుకు గాను కొన్ని సుఖోయ్-30 ఎంకేఐ విమానాలు పాక్.. పంజాబ్ ప్రావిన్సులోని జైషే ప్రధాన స్థావరం బహావల్‌పూర్ దిశగా కదులుతున్నట్లు భ్రమింపజేశాయి.

దీంతో పాక్ ఫైటర్ జెట్లు.. సుఖోయ్ విమానాలను వెంబడించాయి. ఇదే అదనుగా మిరాజ్-2000 యుద్ధ విమానాలతో కూడిన దాడి బృందం గాల్లోకి లేచింది. వ్యూహాం ప్రకారం పీఓకే రాజధాని ముజఫరాబాద్‌కు చేరుకోవడానికి నేరుగా కాకుండా చుట్టు తిరిగి వచ్చాయి.

పాకిస్తాన్ జెట్‌లు దారి మళ్లడంతో అడ్డు అదుపు లేకుండా విజృంభించిన ఇండియన్ ఫైటర్ జెట్లు ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. అయితే పాక్‌కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ భారత విమానాలను వెంబడించింది. భారత యుద్ధ విమానాలు ఉగ్రవాదుల స్థావరాలపై బాంబులు వేయలేదని, కేవలం చెట్లపైనే దాడి చేశాయని పాక్ చెప్పడం గమనార్హం.

ఈ దాడిలో బాలాకోట్‌లో ఉన్న జైషే మొహహ్మద్ అతిపెద్ద ఉగ్రవాద కేంద్రం ధ్వంసమైంది. అయితే సర్జికల్ స్ట్రైక్స్‌కు భారత్....వైమానిక దళాన్నే ఎందుకు ఎంచుకుంది అంటూ దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు.

సైన్యంలోని స్పెషల్ కమాండోస్ లేదంటే నౌకాదళాన్ని రంగంలోకి దించలేదు అనేది భారతీయులను వేధిస్తోంది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

ఉరీ ఉగ్రదాడికి ప్రతీకారంగా 2016లో చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌ పాకిస్తాన్‌కు బాగా గుర్తుంది.. అందుకే భారత్ మరోసారి అటువంటి చర్యకు దిగకుండా సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని మోహరించింది.

ఉగ్రవాదులను సైతం శిబిరాల నుంచి తరలించింది. దీనికి తోడు కశ్మీర్ సరిహద్దుల వెంట భారీగా మంచు కురుస్తుండటం సైన్యానికి అవరోధంగా మారింది. అయితే నేవి సాయంతో పాక్ ఆర్ధిక రాజధాని కరాచీని దిగ్బంధించాలని భారత్ భావించింది.

అయితే ఇది అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీయడంతో పాటు వెను వెంటనే యుద్ధంగా మారే అవకాశం ఉండటంతో కేంద్రప్రభుత్వం ఈ ఆలోచన విరమించుకుంది. వీటన్నింటి తర్వాత ఉగ్రవాద స్థావరాలను సూచిస్తే... వాటిని నామరూపాల్లేకుండా చేసే సత్తా వాయుసేనకు ఉందని.. వైమానిక దళపతి ఎయిర్‌చీఫ్ మార్షల్ ధనోవా ప్రధానికి సూచించారు.

దీంతో రక్షణ రంగ నిపుణులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో చర్చించిన పిమ్మట ప్రధాని ఎయిర్ స్ట్రైక్స్‌కు అనుమతించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios