లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. 

కారు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం మానికపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రయాగ్ రాజ్, లక్నో జాతీయ రహదారిపై గత రాత్రి జరిగింది. ప్రమాదంలో గాయపడినవారిని అస్పత్రికి తరలించారు.

కారులో ప్రయాణిస్తున్నవారంతా మృత్యువాత పడ్డారు. టైర్ పంక్చర్ కావడంతో ట్రక్కును రోడ్డు పక్కన నిలిపినట్లు, కారు వెనక నుంచి ట్రక్కును బలంగా ఢీకొట్టినట్లు ప్రతాప్ గఢ్ పోలీసు సూపరింటిండెంట్ అనురాగ్ ఆర్య చెప్పారు. కారు సగం వరకు ట్రక్కు కిందికి వెళ్లిపోయింది. 

బాధితుులు ఓ వివాహానికి హాజరై గోండాలోని తమ ఇళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బాధితులకు సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.