మహారాష్ట్రలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13మంది మృత్యువాతపడ్డారు. కాగా.. మరో 35మంది తీవ్రంగా గాయపడ్డారు.  కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమంలో దాదాపు 70మంది ఉండి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలోని తాలుకా వాఘాడి గ్రమమంలో రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 9.45 గంటలకు పరిశ్రమలో పేలుడు సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. 

సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెస్క్యూ బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 70 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు శబ్ధాలు వినపడగానే కార్మికులు బయటకు పరుగులు తీశారు. సంఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 13మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని, మృతుల సంఖ్య పెరిగే అకాశముందని పోలీసులు చెబుతున్నారు. గాయపడిన కార్మికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.