ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ 12 అడుగుల విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆవిష్కరించారు. నెల్సన్ మండేలా నుంచి పౌర హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వరకు మహాత్మా గాంధీ అహింసా మార్గం ప్రపంచ అభివృద్ధికి మార్గమని అంగీకరించారని రాష్ట్రపతి తెలిపారు. 

ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ 12 అడుగుల విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆవిష్కరించారు. వివిధ భంగిమల్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసిన గాంధీ వాటికను కూడా ఆమె ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. గాంధీ ప్రపంచ సమాజానికి అమూల్యమైన కానుక అన్నారు. ఆయన విలువలు, ఆదర్శాలు ప్రపంచానికి కొత్త దిశానిర్దేశం చేశాయని ద్రౌపది ముర్ము చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా నుంచి పౌర హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వరకు మహాత్మా గాంధీ అహింసా మార్గం ప్రపంచ అభివృద్ధికి మార్గమని అంగీకరించారని రాష్ట్రపతి తెలిపారు. గాంధీ వాటిక వద్ద మహాత్మా గాంధీ విగ్రహాలు సందర్శకులకు, ముఖ్యంగా పిల్లలకు స్పూర్తినిస్తాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, గాంధీ దర్శన్ వైఎస్ ఛైర్మన్ విజయ్ గోయెల్ పాల్గొన్నారు. 

Scroll to load tweet…