భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వాంతులు రావడంతో 11 ఏళ్ల బాలిక బస్సు కిటికీలోంచి తల బయటకు పెట్టింది. మరో వైపు నుంచి ట్రక్కు దూసుకుని వచ్ిచంది. దీంతో చిన్నారి తల తెగి పడింది. ఈ అకస్మాత్తు సంఘటనకు బస్సులోని ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 

కళ్ల ముందు కూతురు మృతి చెందడంతో తల్లి వేదనకు అంతు లేకుండా పోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖండ్వా జిల్లాలోని రోషియా ఫేట్ వద్ద ఇండోర్ - ఇచ్చాపూర్ రహదారి మధ్య ఈ ప్రమాదం జరిగింది.

తన సోదరితో, తల్లితో కలిసి బాలిక ఇండోర్ వెళ్లేందుకు బస్సు ఎక్కింది. మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో రోషియా ఫేట్ కు చేరుకోగానే బాలికకు వాంతులు వచ్చాయి. దీంతో తల్లి బాలిక తలను కిటికీలోంచి బయటకు పెట్టించింది. ఈలోగా అవతలి వైపు నుంచి దూసుకు వచ్చిన ట్రక్కు పాప తలను బలంగా ఢీకొట్టింది. 

దాంతో పాప తల, మొండెం వేరయ్యాయి. బంతి మాదిరిగా తలి ఎగిరి పడింది. బస్సులో కూర్చున్న తల్లి, సోదరి నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత కన్నీరుమున్నీరుగా విలపించార. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బాలిక తలను, మిగతా శరీరారన్ని ఒక్క చోట చేర్చి ఆస్పత్రికి తరలించారు దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మృతురాలిని తమన్నాగా గుర్తించారు. ఆమె తల్లితో, సోదరితో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరు కావడానికి బస్సు ఎక్కింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.