రాంచీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు లారీని ఢీకొట్టడంతో 11 మంది దుర్మరణం పాలయ్యారు.

వివరాల్లోకి వెళితే.. రాంచీ నుంచి గాయాకు ప్రయాణీకులతో బయల్దేరిన బస్సు రెండో నెండర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున హజీరాబాగ్ జిల్లాలోని దనువాఘటికి చేరుకోగానే బ్రేక్స్ ఫేయిలై స్టీల్ రాడ్స్‌తో వెళుతున్న ట్రాలీని ఢీకొట్టింది.

దీంతో ట్రాలీలోని రాడ్లు బస్సులోకి దూసుకొచ్చి ప్రయాణీకుల శరీరాల్లోకి చొచ్చుకెళ్లాయి. ఇనుప చువ్వలు బలంగా గుచ్చుకోవడంతో 11 మంది అక్కడికక్కడే మరణించగా, 25 మంది గాయపడ్డారు.

అందరూ గాఢనిద్రలో ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.