రజనీకాంత్‌కు షాక్

చెన్నై:తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు తూత్తూకుడిలో
చేదు అనుభవం ఎదురైంది.

తూత్తూకుడిలోని స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ
ఆందోళన చేసిన ఆందోళనకారులపై పోలీసులు జరిపిన
కాల్పుల్లో 13 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.

ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న
క్షతగాత్రులను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బుధవారం
నాడు పరామర్శించారు. 
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్‌ రాజ్‌ అనే
బాధితుడిని రజనీ పరామర్శిస్తుండగా ‘మీరెవరు’ అని
అడిగాడు. దాంతో రజనీ నవ్వి వెళ్లిపోయారు.

రజనీనే కాదు తమను పరామర్శించడానికి వచ్చిన
వీఐపీలందరినీ బాధితులు ఇలాగే ప్రశ్నిస్తున్నారని
ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

రజనీకాంత్‌ను మీరేవరు అని సంతోష్ అనే బాధితుడు
ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

21 ఏళ్ల సంతోష్‌ బీకామ్‌ చదువుతున్నాడు. స్టెరిటైల్‌
కర్మాగారాన్ని మూసివేయాలని తీవ్రంగా కృషిచేసిన వారిలో
ఇతనొకడు. ఇటీవల రాజు అనే మంత్రి బాధితులను
పరామర్శించడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు సంతోష్‌
ఆయన్ని వింత ప్రశ్నలు అడిగారని స్థానికులు
చెబుతున్నారు.

 తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు కూడా
ఇదే అనుభవం ఎదురైంది.